తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ కి ఒకప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే, మహానటి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ కీర్తి ఖాతాలో పడలేది. ఈ సినిమాకి అవార్డులు, ప్రశంసలు దక్కినప్పటికీ కెరీర్ మాత్రం చిక్కుల్లో పడింది. మహానటి కోసం ఫిజికల్‌గా కీర్తిలో వచ్చిన టాన్స్ఫర్మేషన్స్ నుంచి మళ్ళీ సాధారణ స్థాయికి రావడానికి వర్కౌట్స్ చేసి సన్నబడింది.
వరుస అవకాశాలు-ఫ్లాప్స్:
మహానటి తర్వాత వరుస అరడజను సినిమాలను ఒప్పుకుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విభిన్నమైన పాత్రలను పోషించింది. గ్లామర్, డీ-గ్లామర్ రోల్స్ కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయింది. కానీ, హిట్ పడక లోలోపల అల్లాడింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట సినిమా నుంచి కాస్త గ్లామర్ ట్రీట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది.
అయినా, ఈ సినిమా రిజల్ట్ తెలిసిందే. ఆ తర్వాత నాని సరసన దసరా సినిమా చేసే అవకాశం అందుకుంది. ఈ సినిమా ఓ మోస్తరు హిట్..కీర్తికి మంచి పర్ఫార్మర్గా ప్రశంసలు దక్కాయి. ఇక, ఈ సినిమా తర్వాత తెలుగులో గ్యాప్. దీంతో బాలీవుడ్ లో లక్ చెక్ చేసుకుంది. అక్కడ, బేబీ జాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందాలు ఆరబోసింది. బాలీవుడ్ జనాలకి ఇలాంటివేమీ కొత్తకాదు. కాబట్టి, అక్కడ ఎంట్రీ గురించి మాట్లాడుకోవడం అనవసరం.
కొంత గ్యాప్ తర్వాత తెలుగులో, ఎల్లమ్మ..రౌడీ జనార్ధన సినిమాలను ఒప్పుకుంది. కారణం తెలీదు గానీ, ఎల్లమ్మ నుంచి బయటకు వచ్చింది. ఇక, ఇటీవల హిట్ మెషీన్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ లో వెంకీమామకి జంటగా ఎంపికైంది. ఓపెనింగ్ కి వచ్చినప్పుడే అందరి కళ్ళు కీర్తిపై పడ్డాయి. నాభి అందాలను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే, కీర్తికి ఎంత కలిసొస్తుందో గానీ, ఆశలు మాత్రం బాగానే పెట్టుకుంది.
దసరా కాంబో కోసం ఐటం భామగా మారిన కీర్తి:
నాని కి మంచి పేరు తెచ్చిన చిత్రాల్లో ఒకటి దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఇప్పుడు, ఇదే కాంబోలో ది ప్యారడైజ్ అనే పాన్ ఇండియా సినిమా వస్తోంది. 7 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఒక్క ఐటం సాంగ్ తప్ప మిగతా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందట. అయితే, ఈ ఐటం సాంగ్ కోసం కీర్తి సురేష్‌ని తీసుకున్నారు. సినిమాకి, ఈ సాంగ్ మేజర్ ప్లస్ అవుతుందట. ఇలాంటి, పాటలో క్రేజ్ ఉన్న బ్యూటీ కావాలనే కీర్తిని లాగేసినట్టు చెప్పుకుంటున్నారు. కానీ, అసలు విషయం ఏమిటంటే ఇకపై రెమ్యునరేషన్, కాంబినేషన్ బావుంటే స్పెషల్ నంబర్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తానని ఈ రకంగా చెప్పిందని అర్థం చేసుకోవాలి. మరి, ప్యారడైజ్ కి కీర్తి అందాలు ఎంతవరకూ కలీ వస్తాయో చూడాలి.

