ఆక్కినేని అఖిల్, భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన లవ్, ఎమోషనల్, రూరల్ డ్రామా లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తం గా నిర్మించారు.
లెనిన్ అఖిల్ కెరీర్ లోనే ఒక అత్యుతమైన సినిమా నిలవనున్నది. ఏజెంట్ సినిమా తర్వాత దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తో వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయ్.
అఖిల్ చాక్లేట్ బాయ్ ఇమేజ్ కి పూర్తి భిన్నంగా మాస్ పాత్ర లో కనిపించాడు. కొత్త అఖిల్ ని చూడవచ్చు. ఈ మూవీ అఖిల్ కి ఒక మంచి కం బ్యాక్ మూవీ అనొచ్చు. అఖిల్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ కానున్నది.
అఖిల్ తొలిసారిగా పూర్తి ఊరమాస్ రోల్ చేస్తున్నాడు. సినిమా శ్రీరామపురంలో జరిగే ఓ జాతర చుట్టూ తిరుగుతుంది . ఆ ఊరిలో ఆధిపత్యం చెలాయించే ఒక పెద్ద మనిషికి, హీరోకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా. యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి.
యాక్షన్ సన్నివేశాలే కాకుండా అఖిల్, భాగ్యశ్రీ బోర్సే మధ్య సాగే లవ్ ట్రాక్ ఈ సినిమాకు కీలకం. ప్రేమ కోసం హీరో ఎలా పోరాడాడు అనేది అసలు కథ. ఫస్టాఫ్ అంతా రెగ్యులర్ ఎంటర్‌టైనర్‌గా సాగినా, సెకండాఫ్ మాత్రం ఇంటెన్స్ ఎమోషన్స్‌తో చాలా సీరియస్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఓ షాకింగ్ ట్విస్ట్ సినిమాకే హైలైట్.
టెక్నికల్ పరంగా లియోన్ బ్రిస్టో సినిమాటోగ్రాఫి హైలైట్ అని చెప్పొచ్చు. థమన్ మ్యూజిక్, కోరియోగ్రఫీ దినేష్ మాస్టర్ తమ బాధ్యతలను నెరవేర్చారు.
ఇంకా ఈ చిత్రంలో శివాజీ, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, సునీల్, రమేశ్ ఇందిరా తదితరులు నటించారు.


