Irumudi Trailer Review: స్వామీ శరణం..”వెనకాల ఒకడున్నాడు పేగులు తీసేస్తాడు”..

చాలాకాలం తర్వాత ఒక సినిమాను అర్జెంటుగా చూసేయాలి అనేలా ఉంది ‘ఇరుముడి’ ట్రైలర్. మాస్ మహారాజ్ రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ఇది. హీరోయిన్‌గా ప్రియా భావానీ శంకర్ నటిస్తే, బేబీ నక్షత్ర రవితేజ-ప్రియలకి కూతురు పాత్రలో కనిపించబోతోంది. ఇన్నేళ్ల నుంచి రవితేజ ఏదైతే మిస్ అయ్యాడో, అది ‘ఇరుముడి’ సినిమాలో ఉండబోతుంది..అందులో అనుమానమే లేదు.

నిన్నుకోరి, మజిలీ లాంటి బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో ‘ఇరుముడి’ కూడా చేరుతుంది..ఇది శివ నిర్వాణ సినిమా. ఇప్పుడు, థియేట్రికల్ ట్రైలర్ చూసిన తర్వాత అందరి ఫీలింగ్ ఇదే. ఇలాంటి, కథ కదా మాస్ మహారాజ్ కి పడాల్సింది..అంటున్నారు. నిజమే, చేసిన సినిమాలనే మళ్ళీ చేస్తే ఎవరు చూస్తారు. ఇలాంటి కథ అయితే అందరికీ కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా, తండ్రీ-కూతురు మధ్య బాండింగ్ కోసం చూసి తీరాల్సిందే.

నిన్నామొన్నటి వరకూ, ఇదేదో భక్తి ప్రధానంగా సాగే కథ, రవితేజకి సెట్ అవుతుందా? ఇలాంటి సందేహాలను శివ నిర్వాణ ఒక్క ట్రైలర్‌తో కొట్టిపాడేశాడు. త్రినాథ్ అనే తాగుబోతు పాత్రలో రవితేజ నటిస్తున్నాడు. ఊరవల స్కూల్‌లో కొంతమంది ఆడబిడ్డలు చనిపోతుంటారు..వాళ్ళందరినీ దత్తత తీసుకున్నట్టుగా మాస్ రాజ రోల్ డిజైన్ చేశాడు దర్శకుడు. ఏడాది పొడవునా తాగే త్రినాథ్ కూతురు కోసం మాత్రం 41 రోజుల పాటు కఠినంగా అయ్యప్ప దీక్షలో ఉంటాడు. స్వామీ శరణం..అదెందుకో తెలియాలంటే ‘ఇరుముడి’ చూడాల్సిందే గురుస్వామీ.

తాగుడుకు బానిసైనా త్రినాథ్ భార్య ఎన్ని తిట్టినా భరిస్తాడు..ఇంట్లో-బయట, ఊరవతల-ఇవతల ఏం జరిగినా నాన్నకి చెప్పేయాలి అనే కూతురు మణికంఠకి ప్రమాదం పొంచి ఉంటే అయ్యప్ప దీక్షలో ఉన్న ఈ త్రినాథ్ స్కూల్ లో జరిగే ఆడపిల్లల హత్యలు ఆపగలిగాడా..చదవకపోతే పిల్లల్ని చంపేస్తారా? వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే స్వామీ శరణం ఆగస్టు 21వరకూ ఆగాల్సిందే. దర్శకుడిగా శివ నిర్వాణకి, హీరోగా రవితేజకి ఈ దెబ్బతో గట్టి హిట్ ఖాయం అని ట్రైలర్ చెప్పేసింది. కాకపోతే, అది ఏ స్థాయి హిట్టో బొమ్మ పడితేగాని తెలియదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *