నేచురల్ స్టార్ నానీ ఇప్పుడు ఊర మాస్ నాని. ఈ ఇమేజ్ నానికి వచ్చి చాలాకాలమైంది. కానీ, ఆ ఇమేజ్ కి సరైన అర్థం వచ్చింది మాత్రం దసరా సినిమాతో. ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఫ్యామిలీ హీరోతో, దసరా లాంటి రా అండ్ రస్ట్రిక్ కల్ట్ కంటెంట్‌తో సినిమా చేయాలనే ఆలోచనే గొప్పది. మొదటి సినిమాతో ఏ దర్శకుడు చేయని సాహసం కూడా.
ఇలాంటి సాహసం చేసి, సాలీడ్ హిట్ అందుకున్నాడు శ్రీకాంత్. నాని, డెమో షూట్ కి ముందే దసరా చేయ్యాలని డిసైయ్యాడు. డెమో చూశాక బ్లైండ్‌గా శ్రీకాంత్ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాడు. ఫలితంగా దసరా పాన్ ఇండియా హిట్. ఆ ఉత్సాహమే ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల-నాని మళ్ళీ కలిసి ‘ది ప్యారడైజ్’ లాంటి పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం చేయడానికి పునాది వేసింది.

ఈ సినిమా ప్రకటించాక, నాని ఫస్ట్ లుక్ ‘జడల్’ ని పరిచయం చేస్తూ గ్లింప్స్ వదిలాడు శ్రీకాంత్. దీనిలో, తల్లి వాడిన ఒక బూతు పదం చుట్టూ చాలా నెగిటివ్ ట్రోల్స్ వచ్చాయి. దానికి అసలు అర్థం కొంతవరకూ.. తాజాగా వదిలిన టీజర్‌తో చెప్పాడు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో ప్యారడైజ్ టీజర్ ఎలా ఉంటుంది.. అనే ప్రశ్నకి..’తగలబడుతుంది’.. అని సింపుల్ గా ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు ఊహించుకోవడం కష్టం. ఆ రేంజ్లో టీజర్ ఉంది.
అసలు, “నానిలో ఇలాంటి నటుడున్నాడా..అతను ‘జడల్’ ఆ..ఇంతకాలం ఎక్కడున్నాడు..ఏ దర్శకుడికీ కనిపించలేదా..ఎవరూ చూడలేకపోయారా”..ఇన్ని ప్రశ్నలను లేవనెత్తాడు దర్శకుడు శ్రీకాంత్. ఆ మధ్య నాని మాట్లాడుతూ..”ఓ రోజు షూటింగ్ అయ్యాక.. అర్థరాత్రి నీయవ్వ ఏం యాక్టర్ అన్నా నువ్వు”..అని మెసేజ్ పెట్టాడట శ్రీకాంత్. దీనికి టీజర్ నిదర్శనంగా అనిపిస్తుంది. నిజంగానే నాని-శ్రీకాంత్ కలిసి 1 నిముషం 42 సెకన్లలో తగలబెట్టారు.
‘ఈ దేశం ఎవరిదీ’..? ‘ఈ జాగా ఎవరిదీ’..అని నాని అరిచి చెప్పే డైలాగ్స్‌తోనే, ఇది అనచబడిన ఓ వర్గానికి అండగా నిలిచిన నాయకుడి కథ..అని అర్థమవుతోంది. ఆ నాయకుడుకి, ఎదురుగా ఉంది ‘మేరే ప్యారే ప్యారడైజ్ వాయియో’..అని డైలాగ్ చెప్పిన మోహన్ బాబు. “అణచబడ్డ మన జాతే తిరగబడాలే”, “సర్కారున్నది మీ దొరల కోసమా..మా జనం కోసమా”..”ఛీ అని చీదరించుకున్న నలుపు రంగే మన జెండా..కాకే మన గుర్తు”..వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ థియేటర్స్‌లో గ్యారెంటీగా మోత మోగిస్తాయి. జడల్ పాత్రలో నాని విశ్వరూపం చూడబోతున్నామని పవర్‌ఫుల్‌గా చెప్పాడు దర్శకుడు. ఇక, క్లాసిక్ లుక్ లో కయాదు మెరిసింది.
అయితే, డైలాగ్స్ మరీ జెట్ స్పీడ్ లో ఉండటం వల్ల, నాని చెప్పే డైలాగ్స్ మళ్ళీ మళ్ళీ వింటేగానీ అర్థం కావడం లేదు. రక్తం ఏరులై పారే వయిలెన్స్ మాత్రం జనాలకి ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది. టీజర్ చివర్లో బ్లేడ్లతో నాని దిష్టి తీసుకుంటూ చెప్పే డైలాగ్స్ మాత్రం నిజంగా తగలబెడతాయి. మొత్తంగా ఇన్ని రోజుల నుంచి ఈ సినిమా అప్డేట్స్ రాక నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన వాళ్ళకి నిద్ర పట్టడం కష్టమే. ఇప్పుడే ఇలా ఉంటే సెప్టెంబర్ 24న ఎలా ఉంటుందో..

