ముంబై… ఇండియన్ సినిమా డైరెక్టర్లు ఈ సిటీని క్రైమ్ కు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు. తెలుగులో రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ వంటి డైరెక్టర్లు ముంబైని గట్టిగానే వాడారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో లెటెస్ట్ గా చేరిపోయాడు డైరెక్టర్ సుజీత్.ముంబైలో ఓ పోర్టు.. ఆ పోర్టుకు వచ్చిన అక్రమ ఆయుధాలు, ఆ ఆయుధాలను దక్కించుకునేందుకు ఇంటర్నేషన్ డాన్ల ప్రయత్నాలు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఓజీ స్టోరీ. స్టోరీ చాలా పాతదే..! సినిమాటిక్ లిబర్టీలు కూడా దర్శకుడు చాలానే తీసుకున్నాడు. ఎంతలా అంటే… ఒక మనిషి కొంత గోల్డ్ తీసుకువచ్చి ముంబై పోర్టును నిర్మించేంతలా..! కాకపోతే కాస్త ఫ్రెష్ గా అనిపించిన విషయం ఏంటంటే… ముంబై మాఫియాకు జపాన్… బ్యాగ్ డ్రాప్ ను యాడ్ చేయడం. యానిమేడెట్ టైటిల్స్. డిఫరెంట్ కలర్ గ్రేడింగ్ సినిమాను మరో లెవల్ కు తీసుకువెళ్లాయి. సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్. అప్పుడెప్పుడో పూరి ఓ ఆడియో ఫంక్షన్ లో హీరోలు ఏం చెబితే డేట్లు ఇస్తారో చెప్పాడు. అది కామెడిగా చెప్పినా.. ఓజీ సీనిమా చూసిన తర్వాత నాకు నిజమే అనిపిస్తోంది. ఈ సినిమాలో చాలా గన్స్ ఉంటాయ్. విచ్చలవిడిగా కాల్చుకోవచ్చని చెప్పగానే పవన్ ఓకే చెప్పినట్లు ఉన్నాడు. గన్స్, బ్లడ్, కత్తులు, కటార్లు ఇలా చెప్పుకుంటూ పోతే… పెద్ద లిస్టే ఉంటుంది. ప్రశాంత్ నీల్ పుణ్యమా అని.. కేజీఎఫ్ నుంచి మనకు ఎలాగూ ఎలివేషన్ల మాయరోగం పట్టుకుంది కాబట్టి… సినిమా నిండా ఎలివేషన్లతో నింపేశాడు సుజిత్. సుజిత్ ఎలివేషన్లు పెడితే… తమన్ ఊరుకుంటాడా..!కొట్టిన డప్పు కొట్టకుండా కొట్టి కొట్టి సంపాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ వింటున్నంత సేపు… నాకైతే కిక్ సినిమాలో అలీనే గుర్తుకు వచ్చాడు. ఎక్కడ నా ఫేషెంట్… ఎక్కడ..? అని అలీ అన్నట్లు… ఎక్కడ నా పవన్ ఎక్కడ అని…? పవన్ కనిపించడమే ఆలస్యం సావుడప్పులతో సావగొట్టాడు తమన్. పామ్ ( ప్రియాంక మోహన్ ) ఎందుకులే చెప్పుకోవడం. పవన్, పామ్ సీన్లు అస్సలు ఎమోషనల్ ఫీలింగ్ ఇవ్వలేదనే చెప్పాలి. ఇక ఇమ్రాన్ అష్మీ, ప్రకాశ్ రాజ్ ల గురించి మీరు తెరమీదనే చూసేయాలి. ఓవరాల్ గా చెప్పాలంటే… ఓ జస్ గంభీర… ఫ్యాన్స్ కు పండగేరా..! నార్మల్ జనాలకు నరకమేరా..!బాటమ్ లైన్… జీషూశీ షూశీజూ షూషూ.. మాష్యూమా.. ఈష్యూజ ( జపాన్ బాషలో చెప్పాను లెండి సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *